బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఇవాళ లోక్ సభ జీరో అవర్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో భారీ లిక్కర్ స్కాం జరిగిందని అన్నారు. రూ.2,500 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కాంతో పోల్చితే ఏపీ లిక్కర్ స్కాం 10 రెట్లు పెద్దది అని వెల్లడించారు. 2019-2024 మధ్య కాలంలో మద్యం విధానాన్ని మార్చారని ఆరోపించారు. ప్రైవేటు దుకాణాలను మద్యం అమ్మకాల బాధ్యతల నుంచి తప్పించి, ఆ బాధ్యతను ప్రభుత్వ దుకాణాలకు అప్పగించారని సీఎం రమేశ్ వివరించారు. ఐదేళ్లలో రూ. లక్ష కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయని తెలిపారు. మొత్తం లావాదేవీలు పూర్తిగా నగదు రూపంలోనే జరిగాయని, ఒక్కటి కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరపలేదని అన్నారు. ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకున్నారని తెలిపారు.
![]() |
![]() |