టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌ను కూడా రాజకీయ వేదికగా చూడడం దురదృష్టకరం అని వైసీపీ ఎంపీ ఎం.గురుమూర్తి అన్నారు. అయన మాట్లాడుతూ.... పోలవరం ప్రాజెక్ట్, రైల్వేజోన్లలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. దీనిని రాజకీయ పార్టీలకు అతీతంగా ఎంపీలందరూ తీవ్రంగా వ్యతిరేకించాలి. దీనికి తెలుగుదేశం ముందుకు వస్తే, వారి వెనుక నిలబడేందుకు మేం సిద్దంగా ఉన్నాం. 11 పథకాలతో రైతులను ఆదుకున్న చరిత్ర వైయస్‌ఆర్ సీపీ ప్రభుత్వానిది. దీనిపై పార్లమెంట్‌లో ప్రశ్నిస్తుంటే కూడా తెలుగుదేశం ఎంపీలు అడ్డుకున్నారు. అయితే ఈ తరహా విధానాలను ప్రజలు ఎప్పటికీ ఉపేక్షించబోరని వైయస్ఆర్‌సీపీ ఎంపీ స్పష్టం చేశారు.
![]() |
![]() |