కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌లో చాలా స్పష్టంగా పోలవరం ఎత్తును, నీటి నిల్వ సామర్థ్యాన్ని కుదించి దానికి అనుగుణంగా నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొంది అని వైసీపీ ఎంపీ మేడా రఘునాథ్‌రెడ్డి అన్నారు. అయన మాట్లాడుతూ.... వాస్తవానికి పోలవరంకు ప్రాజెక్ట్ 45.75 మీటర్ల ఎత్తుతో 196 టీఎంసీల సామర్థ్యంలో నిర్మాణం పూర్తి చేయాలి. ఇందుకోసం మొత్తం రూ.57 వేల కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. అయితే తాజా బడ్జెట్ సమావేశాల్లో పోలవరం ఎత్తు తగ్గించి 41.5 మీటర్లకు కుదించి కేవలం 115 టీఎంసీల సామర్థ్యానికి పరిమితం చేస్తున్నామని, దీనికి గానూ కేవలం రూ.30 వేల కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం ప్రకటించింది. అంటే కేంద్రం నుంచి రావాల్సిన రూ.27 వేల కోట్ల గ్రాంట్‌ను రాష్ట్రం కోల్పోయింది. అమరావతికి రూ.15 వేల కోట్ల అప్పు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీ పడి ఇంత పెద్ద గ్రాంట్‌ను వదులుకున్నారు అని అన్నారు.
![]() |
![]() |