జేఈఈ మెయిన్స్- 2025 సెషన్-1 ఫలితాల్లో ఎస్సార్ విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని ఆ సంస్థల అధినేత ఎనగందుల వరదారెడ్డి తెలిపారు. ఫలితాల్లో తమ విద్యాసంస్థలకు చెందిన వల్లాల నాగసిద్ధార్థ (ఫిజిక్స్‌లో 100 పర్సంటిల్)తో 99.97 పర్సంటైల్, తాడిపర్తి తేజాస్ ఉద్భవ్‌రెడ్డి 99.83, మారం రాజవర్షిత్‌రెడ్డి 99.81, దిడ్డి ప్రజ్వల్ కుమార్ 99.77 పర్సంటైల్ సాధించారని ఆయన వెల్లడించారు. వీరితో పాటు మరో 25 మంది విద్యార్థులు 99 పర్సంటైల్ సాధించారని తెలిపారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో ఎస్సార్ విద్యాసంస్థలు అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నట్లు వరదారెడ్డి తెలిపారు.
![]() |
![]() |