అహంభావంతో కేసీఆర్, ఫ్రస్టేషన్ తో జగన్ దుర్మార్గాలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వ్యక్తికైనా, సంస్థకైనా డేటా అనేది ఒక ఆస్తి అన్నారు. ప్రజల ఆస్తులకే హైదరాబాద్ లో రక్షణ లేదు. టీడీపీ నేతలతో చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ చేశారు. పిల్లచేష్టలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు నష్టం కలుగుతోందన్నారు. ఎవరైనా డేటా ఇకపై హైదరాబాద్ లో పెడతారా..? ప్రశ్నించారు. అహంకారం నెత్తికెక్కి టీఆర్ఎస్ విపరీత చేష్టలు పాల్పడుతూ, వాళ్లకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. హద్దులు దాటి వ్యవహరిస్తున్నారు. ఏ పార్టీకి లేని టెక్నాలజి టీడీపీ సొంతం. కార్యకర్తల డేటా క్రియేట్ చేసింది పార్టీ. 24ఏళ్లు కష్టపడి డేటా రూపొందించాం. టీడీపీ డేటా దొంగిలించి వైసీపీకి ఇచ్చారు. ప్రభుత్వ డేటా అని అసత్య ప్రచారం చేస్తున్నారు. తమ నేరం బైటపడిందనే అసత్యాల ప్రచారం. కావాలనే గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారు. మన డేటా కొట్టేసి మనపైనే కేసులు పెడుతున్నారు. వైసీపీకి మేలు చేసేందుకే టీఆర్ఎస్ దుర్మార్గాలు.
టిడిపి ఓడిపోతుందని చెప్పడానికి కెటిఆర్ ఎవరు..?. హద్దులు దాటి వ్యవహరిస్తున్నారు. మోదీ, కెసీఆర్, జగన్ ముగ్గురూ ఉమ్మడి ప్రచారం చేయండి. ప్రజలే మీ అరాచకాలకు తగిన బుద్ధి చెబుతారు. కెసీఆర్ కు సామంత రాజుగా జగన్ మారారు. ఏపీని సామంత రాజ్యం చేయాలనేదే కెసీఆర్ కుట్ర. జగన్ ను లొంగదీసుకుని ఏపీపై దాడులకు తెగబడ్డారు. ఉమ్మడి రాష్ట్ర ఆస్తుల్లో వాటా ఇవ్వలేదు. 60ఏళ్ల కష్టంతో కూడబెట్టిన ఆస్తులు లాగేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మూలాలపై దాడులు చేశారు. అయినా ధైర్యంగా ఏపీ ముందుకు పోవడంతో అక్కసు, ఓర్వలేకే తప్పుడు పనులకు దిగుతున్నారు. మనకు రాజ్యాంగం ఉంది. కొన్ని పరిమితులు ఉన్నాయి. అధికారంతో ఏదైనా చేస్తామంటే చూస్తూ ఊరుకోం. సార్వభౌమాధికార దేశంలో మనం ఉన్నాం. ఆర్టీజి డేటా రూపొందించింది ప్రభుత్వం. గోప్యమైన సమాచారం పబ్లిక్ డొమైన్ లో ఉండదు.
పారదర్శకత కోసమే సంక్షేమ పథకాల సమాచారం. ఒకప్పుడు దయ్యాలు కూడా పించన్లు తీసుకునేవి. భూమిపై ఇళ్లు లేకుండానే బిల్లులు మింగేశారు. టెక్నాలజి ద్వారా రాష్ట్రంలో పారదర్శకత తెచ్చాం. అభివృద్ధి, సంక్షేమం వివరాలన్నీ అందరికీ అందుబాటులో, పారదర్శకత కోసమే సమాచార హక్కు చట్టం తెచ్చారు. ప్రభుత్వంలో జరిగేది తెలుసుకోవడం పౌరుల బాధ్యత. ఆంధ్రప్రదేశ్ లో టెక్నాలజితో పారదర్శకత. ప్రతి ఊళ్లో అభివృద్ది, సంక్షేమం బోర్డులు పెట్టాం. బోర్డులపై పెన్షన్లు, ఇళ్లు, రేషన్ కార్డుల వివరాలు ఉన్నాయి. నరేగా పనుల వివరాలు, పనిదినాల సంఖ్య బోర్డులపై పెట్టాం. ప్రజలకు మేలు చేసేది ప్రభుత్వం,ఇష్టానుసారం వ్యవహరించేది ప్రభుత్వం కాదు. ఫారమ్ 7దుర్వినియోగం చేయడం నేరం. ఎన్నికల కమిషనర్ అదే చెప్పారు. తప్పుడు పనులతో ఓట్ల తొలగింపు కుట్రలు నేరస్తుల ఆలోచనలు ఎప్పుడూ నేరాలపైనే ఉంటుంది. గుంటూరులో 4చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేశారు. ఓటమి భయంతోనే జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేస్తున్నారు. రాజధానిలో పంటలు తగులపెట్టడం, పోలవరం కాలువకు గండికొట్టడం. పోలీస్ స్టేషన్లపై దాడులు, అధికారులపై దౌర్జన్యాలు, తునిలో, గుంటూరులో, కొండవీడులో, దెందులూరులో వైసీపీ అరాచకాలకు అంతే లేకుండా పోయింది. ఓట్ల తొలగింపు, కుల రాజకీయాలు, ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసం చేశారు. వైసీపీ తప్పుడు పనులు, తప్పుడు విధానాలను ఎండగట్టాలి. రాష్ట్రంలో చేయాల్సిన అరాచకాలన్నీ చేశారు. ప్రజలు ఛీకొట్టేసరికి పలాయనం చిత్తగించారు. పొరుగు రాష్ట్రం నుంచి మనపై కుట్రలకు తెగబడ్డారు.
ఓటమి భయంతోనే జగన్ అరాచకాలు శ్రుతిమించాయి. దుర్మార్గులతో పోరాటంలో మనం అప్రమత్తంగా ఉండాలి. విభజన నష్టాలకే మనం అధైర్యపడలేదు. మొక్కవోని ధైర్యంతో ముందుకు పోతున్నాం. ఈ కుట్రలకు, అరాచకాలకు వెనుకంజ వేయం. 5కోట్ల ప్రజల అండదండలే మన ధైర్యం. మూడు పార్టీల కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాష్ట్ర వ్యాప్తంగా రేపు ర్యాలీలు నిర్వహించాలి. అంతిమంగా గెలిచేది ధర్మమే, న్యాయమే అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa