ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీని వీడేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే మోదుగుల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 05, 2019, 07:12 PM

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్టీని వీడనున్నారు. దీని కోసం పశ్చిమ నియోజకవర్గంలోని డివిజన్ పార్టీ అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. టిడిపిలో తనకు జరిగిన అవమానాలను కార్యకర్తలతో చెప్పుకుని మోదుగుల కన్నింటి పర్యంతమయ్యారు. అంతే కాకుండా తనకు గౌరవం లేని చోట ఉండలేనని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు చంద్రబాబు ఫోన్ చేస్తారేమోనని ఎదురుచూశానని, అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తీవ్ర ఆవేదన చెందే పార్టీ వీడుతున్నట్లు డివిజన్ అధ్యక్షులకు మోదుగుల తేల్చి చెప్పారు. చివరి సారిగా డివిజన్ పార్టీ అధ్యక్షులతో ఆయన గ్రూపు ఫోటోలు దిగారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఈ రోజు సాయంత్రం వైసీపీ అధ్యక్షుడు జగన్‌తో భేటీ అవుతారు. మోదుగుల ఈసారి ఎన్నికల్లో వైసీపీ నుంచి గుంటూరు లేదా నరసరావుపేట ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa