ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరుల తల్లులకు పాదాభివందనం చేసిన రక్షణ మంత్రి

national |  Suryaa Desk  | Published : Tue, Mar 05, 2019, 07:24 PM

పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ పుల్వామాలో జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. సోమవారం ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అమరులైన జవాన్ల తల్లులకు రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ పాదభివందనం చేశారు. ‘శౌర్య సమ్మాన్ సమరోహ్’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమర జవాన్ల తల్లులను మంత్రి ఘనంగా సన్మానించారు. వారిని శాలువతో సత్కరించిన తరువాత పాదాలకు నమస్కరించి వారిపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. పాదాలకు నమస్కరించేందుకు మంత్రి కిందికు వంగుతుండడంతో అవాక్కైన కొందరు తల్లులు వారించినా నిర్మల పట్టించుకోలేదు. అమరవీరుల తల్లులకు మంత్రి ఇస్తున్న గౌరవాన్ని చూసిన అధికారులు, కార్యక్రమానికి హాజరైన వారు కరతాళ ధ్వనులతో మంత్రిని అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa