ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హ్యాకింగ్‌కు గురైన బీజేపీ వెబ్‌సైట్‌

national |  Suryaa Desk  | Published : Tue, Mar 05, 2019, 07:28 PM

హ్యాకర్లు బాగా తెలివిమీరిపోతున్నారు. వాళ్ళ తెలివి ఎంతరకు పోయిందంటే చివరికి వాళ్ళు బీజేపీ అధికారిక వెబ్‌సైట్‌‌ను మంగళవారం హ్యాక్ చేశారు. పార్టీ వెబ్‌పేజ్‌ ఎర్రర్‌ 522 మెసేజ్‌ చూపడం గందగోళానికి గురిచేసింది. అంతకుముందే బీజేపీ వెబ్‌సైట్‌లో ప్రధాని మోదీ అభ్యంతరకర ఫోటోలు, బూతులు ప్రత్యక్షమయ్యాయని కొందరు తెలిపారు. వెబ్‌సైట్‌కు వున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించి అందుబాటులోకి తెస్తామని అడ్మిన్ పేర్కొన్న సందేశం కూడా వుంది. దీనిపై బీజేపీ ఇంతవరకూ అధికారికంగా ప్రకటించలేదు. భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో బీజేపీ అధికారిక వెబ్‌సైట్‌ హ్యాక్‌ కావడం ప్రాధాన్యత సంతరించకుంది. ఇటీవల పలు భారత ప్రభుత్వ వెబ్‌సైట్లను పాకిస్తాన్‌కు చెందిన హ్యాకర్లు హ్యాక్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలావుంగా మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో బీజేపీ వెబ్‌సైట్‌ను యాక్సెస్‌ చేయగా ప్రధాని మోదీ, జర్మన్‌ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ల వీడియా అభ్యంతరకర పదజాలంతో కనిపించిందని హిందీ న్యూస్‌ వెబ్‌సైట్‌ అమర్‌ ఉజాలా తెలిపింది. ఆ తర్వాత కొద్దిసేపటికే వెబ్‌సైట్‌ అందుబాటులో లేకుండా, ఎర్రర్‌ మెసేజ్‌ చూపిందని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa