ప్రపంచాన్ని ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) శాసిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాబోయే రోజుల్లో డేటానే సంపద అవుతుందని ఆయన పేర్కొన్నారు. హెల్త్‌లో డేటా కింగ్‌గా కిమ్స్ చైర్మన్ బి. భాస్కర్ రావు తయారవుతారని ఆయన స్పష్టం చేశారు. బుధవారం గుంటూరులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 2000 ఏడాదిలో కిమ్స్ తొలి ఆసుపత్రిని తాను ప్రారంభించానని ఆయన గుర్తు చేసుకున్నారు. 25 ఏళ్లలో 5 వేల బెడ్స్‌తో ఐదు రాష్ట్రాలకు కిమ్స్ విస్తరించిందని చెప్పారు. క్రమశిక్షణతోనే ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. సంస్థ బాగుండాలంటే.. అందులో పని చేసే వాళ్లు భాగస్వాములు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. 1995లో తాను ఐటీ గురించి చెప్పానన్నారు.
ఇప్పుడు ఏఐ గురించి చెబుతున్నానని పేర్కొన్నారు. భవిష్యత్తులో భారతీయులు అద్భుతాలు సృష్టించనున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. జెనిటికల్ పరీక్షలు ద్వారా ఎటువంటి రోగాలు రాబోతున్నాయో కూడా భవిష్యత్తులో తెలియనుందన్నారు. అయితే హెల్త్ కాస్ట్ తగ్గాలని ఆయన పేర్కొన్నారు. ఆయుష్మాన్ భవలో భాగస్వాములమవుతామన్నారు. నేచురల్ ఫుడ్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఉత్పత్తి అయ్యే గ్రీన్ ఎనర్జీలో 1/3 ఏపీలో చేయబోతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వెహికిల్స్ వాడే రోజు రావాలని ఆయన ఆకాంక్షించారు.ఇక వాట్సాప్‌లోనే అన్ని సర్టిఫికేట్స్ పొందవచ్చునని చెప్పారు. వివిధ రంగంలో స్కిల్ డెవలప్‌మెంట్ చేయడానికి ముందుకొచ్చే వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. సమర్థవంతమైన నాయకుడు, సుస్థిరపాలన ఉంటే అభివృద్ధి ఉంటుందన్నారు. 2019లో తెలుగు దేశం పార్టీ గెలిచి ఉంటే ఇంత విధ్వంసం జరిగి ఉండేదా? అని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ప్రశ్నించారు.ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే.. ఎలా ఉంటుందో ఎయిమ్స్‌కి నీళ్లు ఇవ్వలేక పోవడమే అందుకు నిదర్శమని ఆయన పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో 300 పడకలతో స్పెషాలిటీ హాస్పటల్ ఏర్పాటు చేసే దిశగా తాము ఆలోచన చేస్తు్న్నామని చెప్పారు.పేదలకు అందుబాటులో మెరుగైన పాలన ఇచ్చేలా తాము ముందుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. 15 శాతం ఆర్థిక వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన వివరించారు. రాబోయే బడ్జెట్‌ను అందుకు అనుగుణంగా రూపకల్పన చేస్తు్న్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
![]() |
![]() |