యువత కోపాన్ని.. ఆవేదనను చెప్పుకోడానికి జనసేన ఒక ప్లాట్‌ఫాం. వారి మనోభావాలు బయటకు చెప్పుకోడానికి, వాటి సాధన కోసం జనసేనను ఒక ఆయుధంగా యువత స్వీకరించింది. 18-22 ఏళ్ల మధ్య ఉన్న యువతే ఎన్నికలను శాసిస్తుంది. మొత్తం ఓటర్లలో 22 ఉన్న వీరు నీతివంతమైన భావి భారతాన్ని ఆవిష్కరిస్తారనే నమ్మకం నాకుంది’’ అని పవన్ కల్యాణ్ అన్నారు. సోమవారం నెల్లూరుకు వచ్చిన ఆయన ఓ కల్యాణ మండపంలో జనసేన పార్టీ కార్యకర్తలు, విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజం పట్ల ఆలోచన, వ్యక్తిగతంగా తనలో మార్పు నెల్లూరు వీఆర్ కాలేజీ నుంచే మొదలైందని పవన్ అన్నారు. వీఆర్‌సీలో సీటు కోసం సిఫారసు కావాల్సి వచ్చిందన్నారు. ఆ రోజు నుంచే సిఫారసు లేని చదువు, లంచాలు లేని సమాజం ఏర్పాటు కోసం ఏం చేయాలనే ఆలోచన తన లో మొదలైందని చెప్పుకొచ్చారు. నీతివంతమైన సమాజ స్థా పన తన ఒక్కడి వల్ల సాధ్యం కాదనీ.. దానికి మీ సహకారం కావాలని విద్యార్థులను కోరారు. జనసేన అధికారంలోకి వస్తే కామన్ స్కూల్ సిస్టమ్ తీసుకొస్తామన్నారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు నిరుద్యోగ భృతి ఇచ్చి యువతను సోమరుల్లా తయారు చేయడం కన్నా, ఉపాధి మార్గాలు చూపి స్వశక్తితో ఎదిగేలా చూడాలని కోరారు.
రాష్ట్రంలో దోపిడిరాజ్యం పోవాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సోమవారం నెల్లూరు, బోగోలు ప్రాంతాల్లో రోడ్‌షో నిర్వహించారు. సాయంత్రం పొద్దుపోయాక బోగోలులో జరిగిన సభలో పవన్ మాట్లాడారు. ప్రత్యే క హోదా ఇవ్వకుండా, హామీలు అమలు చేయకుండా ప్రజల ను బీజేపీ మోసం చేస్తోందని విమర్శించారు. జనసేన పార్టీ హోదా కోసం పోరాటం చేస్తుందన్నారు. విశాఖ రైల్వే జోన్ ముందుగా ప్రకటించి ఉంటే బీజేపీని అభినందిచేవారని, ఎన్నికల సమయంలో ప్రకటించడం రాజకీయ దురుద్దేశమేనని వి మర్శించారు. ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులు కొందరి అభివృద్ధినే చూస్తున్నారని, చట్టసభల్లో కొందరికి మాత్రమే స్థానం కల్పిస్తున్నారన్నారు. నెల్లూరులో అణగారిన కులాలకు సామాజి క న్యాయం జరగడంలేదని, జనసేన అధికారంలోకి వస్తే పేద, బడుగుబలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. అందరి ఆశీర్వాదంతో సీఎం కాగానే అణగారిన వర్గాల అభివృద్ధికి పాటుపడతానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa