ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దారుణంగా పడిపోతున్న బంగారం ధర..

international |  Suryaa Desk  | Published : Tue, Mar 05, 2019, 07:59 PM

గత మూడు రోజులుగా పసిడి ధర నేల చూపులు చూస్తోంది. స్థానిక నగల వర్తకులు, రిటైలర్ల నుంచి డిమాండ్ ఒక్కసారిగా పడిపోవడంతోపాటు అంతర్జాతీయంగానూ ట్రెండ్ బలహీనంగా ఉండడంతో మంగళవారం పది గ్రాముల బంగారం ధర రూ.320 తగ్గి రూ.33,450కి పడిపోయింది. గతంలో ఎన్నడూ లేనంతగా మూడు రోజుల్లో ఏకంగా రూ.880 తగ్గడం గమనార్హం.
దేశ రాజధాని ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.33.450గా ఉండగా, 99.5 స్వచ్ఛత కలిగిన బంగారం ధర పది గ్రాములకు రూ.320 తగ్గి రూ.33,300గా నమోదైంది. 8 గ్రాముల బంగారు నాణెం ధర రూ.100 క్షీణించి రూ.26,400కు తగ్గింది. మరోవైపు బంగారం బాటలోనే నడిచిన వెండి ధర కిలోకు రూ.450 తగ్గి రూ.39,500కు పడింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడమే వెండి ధర క్షీణతకు కారణమని బులియన్ వర్గాలు తెలిపాయి. ఇక, హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,320గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,780గా ఉంది. వెండి కిలోకు రూ. 41,400గా ఉంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa