AP: మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి డ్రైవర్‌ను తిట్టారని వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే చింంతమనేని ప్రభాకర్ స్పందించారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. నా కారుకు ఎదురుగా కారు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అబ్బయ్య చౌదరి దగ్గరుండి కారును అడ్డు పెట్టించారు. నియోజకవర్గంలో గొడవలు సృష్టించాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. దెందులూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు కావాలనే గొడవలకు ప్రయత్నిస్తున్నారని చింతమనేని ఆరోపించారు. అందుకే టీడీపీ నేతలు, కార్యకర్తలు సంయమనం పాటించాలని చెప్పారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. మన నాయకుడు గీసిన గీత దాటకుండా అందరూ వ్యవహరించాలని చింతమనేని ప్రభాకర్ కోరారు.
![]() |
![]() |