సోషల్ మీడియాలో తనను, తన కుటుంబ సభ్యులను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సినీ నటుడు పృథ్వీరాజ్ బుధవారం సైబర్ క్రైం కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఓ నటుడిగా సినిమా ఫంక్షన్ వేదికపై చేసిన వ్యాఖ్యలతో తనను వైసీపీ సోషల్ మీడియా టార్గెట్ చేసిందన్నారు. ప్రేక్షకులను నవ్వించడానికే అలా మాట్లాడాను తప్ప ఎవరినీ ఉద్దేశించి ఆ వాఖ్యలు చేయలేదన్నారు. వైసీపీకి చెందిన అనిల్ సోషల్ మీడియాలో తనపై అసభ్యకరంగా పోస్ట్‌లు పెట్టి వేధించడమే కాకుండా ఇతరులతో కూడా అసభ్యకరమైన పోస్టింగులు పెట్టిస్తున్నాడని, ఫోన్‌లో తిట్టిస్తున్నాడని పృథ్వీరాజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికల్లో తన ఫోన్ నంబర్ పెట్టి వేధింపులకు గురిచేశారని, రోజుకు 1800 కాల్స్ వరకు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపులు తాళలేక తాను ఆస్పత్రి పాలయ్యానని, ఇక ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
![]() |
![]() |