వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌పై ఆయన భార్య పంకజశ్రీ స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆమె.. ఎఫ్ఐఆర్ కాపీని ఇంకా తమకు ఇవ్వలేదని చెప్పాపరు. వంశీని ఎందుకు అరెస్ట్ చేశారో కూడా తమకు తెలియదని చెప్పారామె. వివరాలు అడిగినా పోలీసులు చెప్పడం లేదని ఆరోపించారు. అరెస్ట్ చేసి చాలా సమయం అవుతున్నప్పటికీ.. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకపోవడం ఏంటని ఆమె ప్రశ్నించారు. పోలీసులు.. వంశీని అక్రమ అరెస్ట్ చేశారని ఆయన భార్య మండిపడ్డారు. ఎఫ్ఐఆర్ లేకపోతే లీగర్‌గా వెళ్లడానికి తమకు అవకాశం ఉండదని.. అందుకే పోలీసులు తమకు ఎఫ్ఐఆర్ ఇవ్వడం లేదని పంకజశ్రీ ఆరోపించారు. వంశీతో పంకజశ్రీ అరగంటపాటు మాట్లాడారు.