నిజాయితీకి, నిరాడంబరత్వానికి, విలువలకు మారుపేరైన దామోదరం సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన సంజీవయ్య జీవిత ప్రస్థానం ఆద్యంతం స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయమని అన్నారు. ఆ మహానుభావుని జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం తెలుగుజాతికి గర్వకారణమన్నారు. దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా ఆయన దేశసేవను, దళిత జనోద్ధరణను స్మరించుకుందామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa