ఇటీవల విశాఖలో ప్రధాని మోడీ పర్యటన తరువాత బీజేపీకి మైలేజీ పెరిగినట్టు, కమలనాధులంతా భావిస్తున్నా, విష్ణుకుమార్‌రాజు మాత్రం ఇంకా ఎటూ తేల్చులేకపోతున్నారని విశ్వసనీయ సమాచారం. అది స్థానికంగా గెలుపునకు దోహదపడుతుందా? లేదా? అనే మీమాంసలో వున్నట్టు తెలుస్తోంది. ఒక వైపు బీజేపీ తరఫున పోటీకి సిద్ధపడుతూనే...మరో వైపు తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఒకసారి కలిసి తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలని ఆయన యోచిస్తున్నట్టు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో చంద్రబాబును కలవడానికి విష్ణుకుమార్‌రాజు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ తరువాతే ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది స్పష్టమవుతుంది. ఒకవేళ విశాఖ ఉత్తరం నుంచి విష్ణుకుమార్‌రాజు పోటీ చేయకపోతే పార్టీ నగర అధ్యక్షుడు ఎం.నాగేంద్ర అభ్యర్థి అవుతారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa