విశాఖపట్నం నగరంలో ఇటీవల నిర్వహించిన ప్రధాని నరేంద్రమోదీ సభకు తాము ఊహించిన దానికంటే ఎక్కువ మంది జనం వచ్చారని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలు మంచి ఉత్సాహంగా ఉన్నారు. ఇదే ఊపులో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి తమ అదృష్టం పరీక్షించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. పాకిస్తాన్‌పై చేసిన సర్జికల్ స్ర్టైక్స్‌తో ప్రధాని మోదీ గ్రాఫ్ మళ్లీ పెరిగిందని, అది ఎన్నికల్లో తమ పార్టీకి లాభిస్తుందని అంటున్నారు.
విశాఖపట్నం వరకు చూసుకుంటే...బీజేపీ శాసనసభాపక్ష నేత, విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు గత కొన్నాళ్లుగా అటా?, ఇటా? అన్నట్టు తర్జనభర్జన పడుతున్నారు. ఒకానొక దశలో తెలుగుదేశం పార్టీలో చేరి, మళ్లీ ఉత్తరం నుంచే పోటీ చేయాలని భావించారు. అయితే ప్రధాని విశాఖ పర్యటన తరువాత తాను ఒక నిర్ణయానికి వస్తానని ఆయన చెప్పుకొచ్చారు. విశాఖపట్నానికి కొత్త రైల్వేజోన్ ప్రకటిస్తే...బీజేపీకి మైలేజీ వస్తుందని, అప్పుడు పార్టీ అభ్యర్థిగా మళ్లీ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తన మనసులో మాట చెప్పారు. ఒకవేళ రైల్వేజోన్ ప్రకటించకపోతే ఏమిటనేది ఆలోచిస్తానని వివరించారు. ఆయన ఆశించినట్టుగానే ప్రధాని విశాఖ పర్యటనకు ముందే కేంద్రం విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ప్రకటించింది. అందులో వాల్తేరు డివిజన్ లేకపోయినప్పటికీ ‘జోన్ తెస్తామని మాట ఇచ్చాము...తెచ్చాము. హామీ నిలుపుకొన్నాము’ అంటూ సమర్థించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారబోరని మరోసారి విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa