ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధైర్యముంటే నాపై కేసు నమోదు చేయండి : దిగ్విజయ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 06, 2019, 11:04 AM

ధైర్యముంటే తనపై కేసు నమోదు చేయాలంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ ప్రధాని మోడీకి సవాల్‌ విసిరారు. పుల్వామా ఘటన ‘యాక్సిడెంట్‌’ అంటూ దిగ్విజయ్‌ చేసిన వ్యాఖ్యలు కేంద్రంలో ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై ప్రధానితో సహా పలువురు కేంద్ర మంత్రులు దిగ్విజయ్‌పై మండిపడ్డారు. దిగ్విజయ్‌ పాకిస్తానీ మద్దతుదారుడని, దేశద్రోహి అని మోడీ, ఆయన మంత్రివర్గ సహచరులు వ్యాఖ్యలు చేశారు. దీనిపై దిగ్విజయ్‌ స్పందిస్తూ తాను ఢిల్లిలో ఉన్నప్పుడే పుల్వామా ఘటన యాక్సిడెంట్‌ అంటూ ట్వీట్‌ చేశానని, ఢిల్లి పోలీసులు కేంద్రం ఆధీనంలోనే ఉన్నందున ధైర్యముంటే తనపై కేసు నమోదు చేయాలని దిగ్విజయ్‌ సవాల్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa