వైఎస్సార్‌సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వంశీపై పిర్యాదు చేసిన సత్యవర్ధన్ ను పోలీసులు సోమవారం కోర్టుకు తీసుకురానున్నారు. 164 కింద స్టేట్ మెంట్ రికార్డు చేయాలని అధికారులు పిటిషన్ వేశారు. కాగా ఇప్పటికే 161 కింద పోలీసులు స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఈరోజు ఆ స్టేట్ మెంట్ రికార్డుకు ఛీప్ మెట్రో పాలిసెషన్ కోర్టు న్యాయమూర్తి కోర్టును నిర్దేశించనున్నారు. సత్యవర్ధన్‌ను బెదిరించిన కేసులో వంశీ అనుచరులు 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ఐదుగురిని అరెస్టు చేశారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా విచారణ నిమిత్తం పది రోజుల పాటు వంశీని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేశారు. ముదునూరి సత్యవర్ధన్‌ను న్యాయాధికారి ముందు సోమవారం ప్రవేశపెట్టడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. వంశీ ప్రణాళికలతో ఆయన అనుచరులు తనను బెదిరించి కిడ్నాప్ చేశారని, టీడీపీ కార్యాలయంపై జరిగిన కేసులో తనకు సంబంధం లేదని చెప్పించారని సీఆర్పీసీ 161 ప్రకారం సత్యవర్ధన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ వాంగ్మూలాన్ని సీఆర్పీసీ 164 కింద న్యాయాధికారి ముందు చెప్పాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పోలీసులు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌కు లేఖ రాశారు. సత్యవర్ధన్ నుంచి 164 వాంగ్మూలాన్ని నమోదు చేసుకునేందుకు కోర్టును కేటాయించాలని పేర్కొన్నారు. దీనిపై సీఎంఎం కోర్టు సోమవారం నిర్ణయం తీసుకుని కోర్టును కేటాయించే అవకాశాలు ఉన్నాయి.
![]() |
![]() |