ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమ్మక్క జన్మస్థానాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2025, 04:17 PM

సమ్మక్క జన్మస్థానమైన అగ్రం పహాడ్ సమ్మక్క సారలమ్మ జాతరను విశాలమైన రోడ్లతో  అద్భుతంగా అభివృద్ధి చేస్తానని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆత్మకూర్ మండలం అగ్రం పహాడ్ సమ్మక్క సారలమ్మ వనదేవతల దర్శనానికి వచ్చిన ఎమ్మెల్యే రేవూరి  ప్రకాష్ రెడ్డికి పూజారుల బృందం ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే గణపతికి,సమ్మక్క సారలమ్మ, సౌడలమ్మ లకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. జాతర పరిసరాలు పరిశీలించి మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్, మాజీ జాతర చైర్మన్ బొరిగం స్వామి లను వివరాలడిగి తెలుసుకున్నారు. 
నాయిని బ్రాహ్మణులు, స్థానికులు జాతర ప్రాంగణం చుట్టూ విశాలంగా లేకపోవడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యేకు వివరించారు. జాతర సమయంలో పంట పొలాలు వేయడం వల్ల ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాలు, దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు విడిది చేసేందుకు స్థలము లేక ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యేకు వివరించారు. ఫిబ్రవరి లో వచ్చే ప్రధాన జాతర వరకే ఇప్పటి నుండే పక్కా ప్రణాళికతో జాతర ప్రాంగణం చుట్టూ విశాలమైన రోడ్లతో పాటు లింగమడుగు పల్లె నుండి జాతర వరకు రెండు కోట్ల 65 లక్షలతో డబుల్ బీటీ రోడ్ వేయిస్తామన్నారు. 
ముసాలపల్లి నుండి జాతర వరకు ఒక కోటి 90 లక్షలతో డబుల్ బీటీ రోడ్డు వేయిస్తానన్నారు. జాతరకు చుట్టూ రెండు కిలోమీటర్ల వరకు పంటలు వేయకుండా ముందస్తు చర్యలు తీసుకొని జాతరకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. లక్షలాది మంది వచ్చి వనదేవత దర్శించుకునే జాతరను అద్భుతంగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. పర్యాటక కేంద్రం చేస్తానన్న వారు చేయకుండానే పోయారని జాతరకు వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తానన్నారు. 
సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వనదేవతలు దర్శించుకుని పిల్లాపాపలతో సంతోషంగా వెళ్లే విధంగా సౌకర్యాలు కల్పించి భక్తుల మన్న నలు పొందడమే మా లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బీరం సునంద సుధాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్, రాష్ట్ర ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత పర్వతగిరి రాజు, మాజీ మార్కెట్ చైర్మన్ బోరిగం స్వామి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరికరాల వాసు, జిల్లా కాంగ్రెస్ నాయకులు ము ద్ధం సాంబయ్య, ఎనక తాళ్ల రవీందర్, ముద్దం కృష్ణంరాజు, అల్వాల రవి, మాజీ సర్పంచ్ కంచ కుమారస్వామి, పూజారి ధర్మేందర్, చిలువేరు  బిక్షపతి, మండల నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa