ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్చి 8 నుంచి దీదీ ఎన్నికల ప్రచారం

national |  Suryaa Desk  | Published : Wed, Mar 06, 2019, 04:20 PM

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ మార్చి 8న ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మమతాబెనర్జీ ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నట్లు పార్టీ అధికారి ప్రతినిధి ఒకరు తెలిపారు. తృణమూల్ ఉమెన్స్ వింగ్స్ ఫోరం ఆధ్వర్యంలో శ్రద్దానంద పార్కు నుంచి పార్క్ స్ట్రీట్ వరకు చేపట్టనున్న ర్యాలీలో మమతాబెనర్జీ పాల్గొంటారని వెల్లడించారు. 2014 పార్లమెంట్ ఎన్నికలు, 2016 అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలను కూడా మమతాబెనర్జీ మహిళాదినోత్సవం రోజునే ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa