ఆమదాలవలస పట్టణ సమీపంలోని శ్రీహరిపురానికి చెందిన యువకుడు పొన్నాడ సురేష్ అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి నట్లు ఎస్‌ఐ సనపల బాల రాజు తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు... ఆమదాలవలస పట్ట ణానికి చెంది న ఓ ప్రైవేటు వడ్డీ వ్యాపారి నుంచి సురేష్ నిరంతరం ఒత్తిడి ఎదుర్కొంటు న్నాడు. ఇటీవల ఆ వడ్డీ వ్యాపారి ఇంటి వద్దకు వెళ్లి సురేష్ తల్లిదండ్రు లపై ఒత్తిడి తీసుకువచ్చాడు. దీంతో విసుగు చెందిన సురేష్ ఆదివారం రాత్రి పురుగుల ముందు తాగి అప స్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో పట్టణం లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి ప్రథమ చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. అనం తరం మెరుగైన వైద్య సేవలు నిమిత్తం శ్రీకాకుళం తరలిం చారు. సురేష్ ఇచ్చిన వాంగ్మూలంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa