ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 07, 2019, 10:52 AM

అమరావతి : తెలుగుదేశం పార్టీ నేతలతో  సీఎం చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, బూత్ కన్వీనర్లతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. పసుపు-కుంకుమ రెండో విడత చెల్లింపులు, ఓట్ల తొలగింపు అంశాలపై చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు. రేపు మహిళా దినోత్సవం రోజే మహిళలకు పసుపు-కుంకుమ నగదు అందుతుందని అన్నారు. ఇవాళ మహిళలకు శుభదినమని,  పసుపు-కుంకుమ రెండో విడత చెల్లింపులు జమ అవుతాయన్నారు. ఒక్కో మహిళ ఖాతాలో రూ.3500 జమ అవుతుందన్నారు. మహిళలకు మరోవిడత రూ.4వేలను త్వరలోనే చెల్లిస్తామని చంద్రబాబు తెలిపారు. రేపు అన్ని చోట్ల డ్వాక్రా మహిళలు ర్యాలీలు నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్రంలో 59లక్షల ఓట్ల తొలగింపు సూత్రధారి జగన్మోహన్ రెడ్డేనని అన్నారు. వినూత్న సంక్షేమం ద్వారా పేదల్లో భరోసా కల్పిస్తున్నామని, సంక్షేమ కార్యక్రమాలు చూసి వైకాపా, తెరాస, భాజపా నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. రాష్ట్రంపై ఈ మూడు పార్టీలు కుట్రల మీద కుట్రలు చేస్తున్నాయన్నారు. ఏపీలో ఓట్ల తొలగింపు వెనుక మూడు పార్టీల కుట్ర ఉందన్నారు. మోడీ, కేసీఆర్ అండతోనే జగన్ చెలరేగిపోతున్నారన్నారు. తొలిదశలో 13లక్షల ఓట్ల తొగింపునకు కుట్ర పన్నారన్నారు. రెండువేల మంది వైకాపా వాళ్లే 8లక్షల దరఖాస్తులు పెట్టారని చంద్రబాబు అన్నారు. సకాలంలో వేగంగా స్పందించి కుట్రలను అడ్డుకున్నామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa