చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మూడు శాసనసభ స్థానాలకు అభ్యర్థుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. చిత్తూరు లోక్‌సభ పరిధిలోని నాయకులతో ఆయన బుధవారం అర్ధరాత్రి ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. కుప్పం నుంచి మళ్లీ చంద్రబాబు పోటీ చేయనున్నారు. పలమనేరు నుంచి మంత్రి అమరనాథ్‌రెడ్డి, చంద్రగిరి నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని అభ్యర్థిత్వాలను సీఎం ఖరారు చేశారు. చిత్తూరు నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న సత్యప్రభ అస్వస్థతకు గురవడంతో ముఖాముఖి సమావేశానికి హాజరవలేదు. చిత్తూరులో మళ్లీ సత్యప్రభ అభ్యర్థిత్వాన్నే ఖరారు చేసే అవకాశం ఉంది. పూతలపట్టు, నగరి, జీడీ నెల్లూరు నియోజకవర్గాలపై నిర్ణయాన్ని పెండింగ్‌లో ఉంచారు. పూతలపట్టు నుంచి నియోజకవర్గ ఇన్‌ఛార్జి లలితకుమారి, రవి టిక్కెట్ ఆశిస్తున్నారు. జీడీ నెల్లూరు టిక్కెట్‌ని మాజీ ఎమ్మెల్యే కుతూహలమ్మ కుమారుడు హరికృష్ణ ఆశిస్తున్నారు. నగరి టిక్కెట్ కోసం గాలి ముద్దుకృష్ణమనాయుడి కుమారులు భానుప్రకాష్, జగదీష్ పోటీ పడుతున్నారు. పుత్తూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ అధినేత అశోక్‌రాజు కూడా రేసులో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa