విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీ చేరిక ఖాయమైంది. దీంతో టీడీపీ, జనసేన పార్టీల్లో ఏదో ఒక పార్టీలో చేరనున్నారన్న ఊహాగానాలకు తెరపడింది. ఈ నెల 9న జగన్ సమక్షంలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, కుమారుడు రత్నాకర్ వైసీపీలో చేరనున్నారు. గతంలో జనసేన అధినేత పవన్ స్వయంగా దాడి ఇంటికి వెళ్లడంతో ఆయన జనసేనలో చేరతారని అంతా భావించారు. కానీ ఆయన అనూహ్యంగా మళ్లీ వైసీపీలోనే చేరాలని నిర్ణయించుకోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. కొణతాల రామకృష్ణ టీడీపీ చేరిక ఖరారు కావడంతో దాడి వీరభద్రరావు వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కొణతాల, దాడి కుటుంబాలకు కొన్నేళ్ల నుంచి రాజకీయ వైరం ఉంది. గతంలో ఇద్దరూ వైసీపీలో చేరారు. అదే మాదిరిగా ఇద్దరూ వైసీపీ నుంచి బయటికొచ్చారు. కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఈ ఇద్దరూ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చెరో దారి వెతుక్కున్నారు. దీంతో విశాఖ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa