ట్రెండింగ్
Epaper    English    தமிழ்

16వ తేదీలోగా టిడిపి అభ్య‌ర్ధుల ఎంపిక ఓ కొలిక్కి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 08, 2019, 01:57 AM

ఎన్నికల షెడ్యూల్‌కి ముందే టీడీపీ అభ్యర్థుల ఎంపికలో దూకుడు ప్రదర్శిస్తోంది. జిల్లాలోని 19 అసెంబ్లీ సెగ్మెంట్లకుగానూ 14 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయ్యింది. మూడు ఎంపీ స్థానాలకుగానూ కాకినాడ సీటును సునీల్‌కు ఖరారు చేసే అవకాశం ఉండగా, ఇంకా అమలాపురం, రాజమహేంద్రవరంలలో ఎటూ తేలలేదు. పార్లమెంటు స్థానాలతోపాటు.. మిగిలిన మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ఈనెల 16వ తేదీలోగా ఒక కొలిక్కి తీసుకురావాలని అధిష్ఠానం భావిస్తోంది. కాకినాడ లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకుగాను ప్రత్తిపాడు మినహా మిగతా ఆరు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. తుని, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, కాకినాడ రూరల్‌, కాకినాడ సిటీ స్థానాలకు సిటింగ్‌లకే అవకాశం ఇచ్చారు. ప్రత్తిపాడు సీటు విషయంపై ఇంకా పూర్తిగా స్పష్టత లేదు. ఇక్కడ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, డీసీసీబీ చైర్మన్‌ వరుపుల రాజా మధ్య పోటీ నెలకొని ఉంది. బయటకు రకరకాల ఊహాగానాలు వస్తున్నా తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.  రాజమహేంద్రవరం రూరల్‌ , అనపర్తి, రాజానగరం అసెంబ్లీలకు బుచ్చయ్య చౌదరి, రామకృష్ణారెడ్డి, పెందుర్తి వెంకటేష్‌ల పేర్లు ఖరారయ్యాయి. రాజమహేంద్రవరం సిటీకి ఎవరనే విషయంలో కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఇక్కడ నుంచి ఆదిరెడ్డి భవాని పేరు దాదాపు ఖాయమైనట్టు ప్రచారం జరుగుతున్నా తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. అలాగే అమలాపురం లోక్‌సభ పరిధిలో ముమ్మిడివరం, కొత్తపేట, రామచంద్రపురం, మండపేట, రాజోలు సీట్లకు సిటింగ్‌లైన దాట్ల సుబ్బరాజు, బండారు సత్యానందరావు, తోట త్రిమూర్తులు, వేగుళ్ల జోగేశ్వరరావు, గొల్లపల్లి సూర్యారావు అభ్యర్థిత్వాలు ఖాయంగా కనిస్తున్నాయి.


 రంపచోడవరం రేసులో.. : రంపచోడవరం ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం నుంచీ టీడీపీ సీటు కోసం పోటీ ఎక్కువగా ఉంది. సిటింగ్‌ ఎమ్మెల్యే రాజేశ్వరితోపాటు.. ఉపాధ్యాయ సంఘ నేత బొగ్గుల కాటమరెడ్డి మధ్య ప్రధానంగా పోటీ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబూరమేష్‌ కూడా ఆశావహుల జాబితాలో ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa