శాంతి మార్గం అనే నినాదంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న జైన సమాజం సామాజిక సేవలు స్ఫూర్తిదాయకమని నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు అన్నారు. విజయవాడలో నిర్వహిస్తున్న జైన్ మందిరాల ప్రతిష్టా మహోత్సవాల కార్యక్రమంలో భాగంగా పున్నమి హోటల్ ప్రాంగణంలోని సంభవనగర్‌లో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమానికి గురువారం సీపీ ద్వారకా తిరుమలరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైన మందిరాల ప్రతిష్ట మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న జైన సమాజం.. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ అదే ఉత్సాహంతో ముందుకు సాగుతుందన్నారు. జైన మందిరాల ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుండి జైనులు తరలిరావడం అభినందనీయం అన్నారు. ఈ సందర్భంగా ఉత్సవాలు నిర్వహణ విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు. శాఖా పరంగా తమ సహకారం అందిస్తామన్నారు. జైన సమాజం ప్రతినిధులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ ద్వారకా తిరుమలరావును జైన సమాజం తరఫున శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జైన సమాజం ప్రతినిధులు ప్రవీణ్ రాంకా తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa