ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం కావాల‌న్న‌ జగన్‌ కలలు క‌ల్ల‌లే ... మంత్రి దేవినేని ఉమా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 08, 2019, 02:12 AM

తెదేపా సానుభూతి ఓటర్లను తొలగించి.. దుర్భుద్ధితో సీఎం కావాలని వైఎస్ జగన్‌ కలలు కంటున్నారని అవి క‌ల్ల‌లు కావ‌టం ఖాయ‌మ‌ని రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు వ్యాఖ్యానించారు. గురువారం ఉద‌యం విజ‌య‌వాడ పార్టీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ తెలంగాణలో 24 లక్షల మంది ఓట్లు తొలగించారని ఫిర్యాదు చేస్తే క్షమించాలని చెప్పి అక్కడి అధికారులు వదిలేశారని గుర్తుచేశారు. ఏ మొహం పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం తప్పుడు కేసులు నమోదు చేస్తోందని ప్రశ్నించారు. అంతకుముందు ఓట్ల తొలగింపు వ్యవహారంపై కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌కు గురువారం ఫిర్యాదు చేశారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్‌, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఇతర తెదేపా నేతలతో కలిసి ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీలో మరోసారి చంద్రబాబుకు ప్రజలు పట్టం కడతారని తెలిసే మోదీ, జగన్‌, కేసీఆర్‌ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa