ద్వారకా తిరుమల,మేజర్ న్యూస్: శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి హుండీ లెక్కింపు గురువారం ఉదయం స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో దేవాలయ ఈ వో సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు నడుమ దేవాలయ సిబ్బంది హుండీల లెక్కింపు నిర్వహించారు. గడచిన 21 రోజులకు గాను జరిగిన ఈ హుండీ లెక్కింపు లో శ్రీ వారికి నగదు రూపేణ రూ2,22,23,339లు ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో సత్యనారాయణ మూర్తి తెలిపారు.అలాగే భక్తులు సమర్పించిన కానుకల రూపేనా 215 గ్రాముల బంగారం,4-085 కేజీల వెండి లభించినట్లు ఈ ఓ పేర్కొన్నారు. పాత నోట్లు 500(5),1000(21),2000(1), అలాగే 16 విదేశీ కరెన్సీ సైతం హుండీలో ద్వారా లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.ఈ క్రమంలో అన్ని విభాగాల సూపరింటెండెంట్ లు,ఆలయ సిబ్బంది, భక్తులు,సేవకులు, పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa