ట్రెండింగ్
Epaper    English    தமிழ்

44మంది పాకిస్తానీలకు భారత పౌరసత్వం…

national |  Suryaa Desk  | Published : Fri, Mar 08, 2019, 03:08 AM

రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన 44 మందికి రాజస్థా‌న్ ప్రభుత్వం భారత పౌరసత్వం కల్పించింది. వీరంత చాలా ఏళ్ల క్రితమే భారత్‌ కు వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. దీంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై రాజస్థాన్ అదనపు సీఎస్ రాజీవ స్వరూప్ మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ నుంచి భారత్‌కు వలస వచ్చిన 44 మంది రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఉదయ్‌పూర్ 15మంది, పాలిలో 11 మంది, జాలోర్‌లో 6మంది, బార్మేర్ లో 12 మంది చాలా కాలంగా భారత పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో వారికి భారత‌దేశ పౌరసత్వ ఇచ్చాం. దరఖాస్తు లోపాల కారణంగా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న చాలా కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి’ అని సీఎస్ రాజీవ స్వరూప్ తెలిపారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa