ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ఓటరు అవగాహనపై బైక్ ర్యాలీ : శ్రీ‌కాకుళంజిల్లా కలెక్టరు జె.నివాస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 08, 2019, 03:30 AM


  ఓటు హక్కు కలిగిన పౌరులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలకు అవగాహన కలిగించనున్నట్లు శ్రీ‌కాకుళంజిల్లా కలెక్టరు మరియు జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ఇందలో భాగంగా స్వీప్ కార్యక్రమం ద్వారా ఈ నెల 8 వ తేదీన సూర్య మహల్ జంక్షన్ నుండి బైక్ ర్యాలీని ప్రారంభించనున్నామని తెలిపారు. 10వ తేదీన ఎన్.టి.ఆర్.మున్సిపల్ హై స్కూల్ మైదానంలో ముగ్గుల పోటీలు నిర్వహించనున్నామని, ఉదయం 9 గం.ల నుండి 11 గం.ల వరకు పోటీలు నిర్వహిస్తామని, ముగ్గులు వేయడానికి కావలసిన మెటీరియల్ (ముగ్గుపిండి, రంగులు) కూడా నిర్వాహకులే అందచేస్తారని తెలిపారు. గెలుపొందిన వారికి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సోలేషన్ క్రింద అయిదు బహుమతులు అందచేయనున్నామని తెలిపారు. ప్రధమ బహుమతి పొందిన వారికి రూ.5 వేలు, ద్వితీయ బహుమతి పొందిన వారికి రూ.3 వేలు, తృతీయ బహుమతి పొందిన వారికి రూ.2 వేల రూపాయలను అందించనున్నామని, కన్సోలేషన్ క్రింద అయిదుగురికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలను చొప్పున ఇవ్వనున్నట్లు కలెక్టరు తెలిపారు. ముగ్గుల పోటీల నిమిత్తం ఫోన్ నెం.9291262073 ను సంప్రదించవలసినదిగా తెలిపారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa