లక్నో: కాశీ విశ్వనాథ్ ఆలయ విస్తరణ, సుందరీకరణ పనులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. భారత వైమానికదళ విమానంలో ప్రధాని ఈ ఉదయం తన పార్లమెంట్ నియోజకవర్గమైన వారణాసికి చేరుకున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ఆ రాష్ట్ర గవర్నర్ రాం నాయక్, సీఎం యోగీ ఆదిత్యానాథ్ ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి బయల్దేరిన ప్రధాని వారణాసి కాశీ విశ్వనాథ్ ఆలయానికి చేరుకున్నారు. 40 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆలయం పేరు మీదుగా ఐదు ఇటుకలు పేర్చి పనులను ప్రారంభించారు. మొత్తం నాలుగు దశల్లో ఆలయ అభివృద్ధిని చేపట్టనున్నారు. గవర్నర్, సీఎంతో పాటు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మహేంద్రనాథ్ పాండే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రధాని కాశీ విశ్వేశ్వరుడి పూజలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa