ఆంధ్రప్రదేశ్‌లో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు నుంచి తమిళనాడును కనెక్ట్ చేసే.. చిత్తూరు-తచ్చూరు గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ట్రయల్ రన్ నిర్వహించారు. ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఈ హైవేపైకి వాహనాలను అనునమతించారు. ఈ హైవేలో సుమారు 100 కి.మీ వేగంతో వెళితే దాదాపు గంటన్నరలోనే తమిళనాడుకు, పోర్టుకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేశారు. త్వరలోనే ఈ హైవేపైకి వాహనాలను పూరిస్థాయిలో అనుమతించనున్నారు.. టోల్ రుసుము వసూలు చేయనున్నారు. ఈ హైవే మొత్తం 116 కిలోమీటర్లు ఆరు లైన్లుగా ఉంటే.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే 95 కిలో మీటర్లు ఉంది.. మిగిలిన 21 కిలోమీటర్లు తమిళనాడులో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa