రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట మార్చి 9న పెళ్లి వేడుక జరగనుంది. అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ, ప్రముఖ వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాను వివాహామాడనున్నారు. ఈ క్రమంలో ముంబైలోని అనాధ ఆశ్రమాల్లోని 2000 మంది పిల్లలకు ముకేశ్ అంబానీ, నీతా అంబానీతో పాటు ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా కలిసి భోజనం వడ్డించారు. గతేడాది డిసెంబర్‌లో ముకేశ్ అంబానీ ఏకైక కూతురు ఈషా అంబానీ పెళ్లి వేడుకల సందర్భంగా డిసెంబర్ 7 నుంచి 10వ తేదీ వరకు నిత్య అన్నదానం చేశారు. 5100 మందికి పైగా 100 రకాల వంటకాలతో అన్నదానం చేశారు.
గతేడాది మార్చిలో ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా నిశ్చితార్థం గోవాలోని ఓ ఫైవ్‌స్టార్ రిసార్ట్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ప్రముఖ వజ్రాల వ్యాపారి రస్పెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతా, ఆకాశ్ అంబాన్నీ చిన్నప్పటి నుంచి స్నేహితులు. వీరిద్దరూ ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఆకాశ్ రిలయన్స్ రిటైల్, జియోలకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటున్న సంగతి తెలిసిందే. శ్లోకా లండన్‌లోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పట్టా పొందారు. ప్రస్తుతం తమ డైమండ్ కంపెనీలో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు శ్లోకా. గతేడాది డిసెంబర్‌లో ముకేశ్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ వివాహం పిరమల్ గ్రూప్ అధినేత అజయ్ పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమల్‌తో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa