ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలకు శుభాకాంక్షలు చెప్పిన వైయస్‌ జగన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 08, 2019, 01:05 PM

అమరావతి :అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈమేరకు గురువారం రాత్రి కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకోవడం ఆనందదాయక మన్నారు. మహిళా సాధికారత ద్వారా మహిళాభివృద్ధి సాధ్యమన్నారు. సాంఘీక అసమానతలు తొలగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమన్నారు. రాజకీయంగా మహిళలు రాణిస్తే వారి సమస్యలపట్ల చట్ట సభల్లో పోరాడి వారికి న్యాయం జరిగే అవకాశముంటుందన్నారు. ఇందులో భాగంగానే తమ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నవరత్నాల్లో మహిళలకు పెద్దపీట వేయడం జరిగిందని తెలిపారు.అమ్మతనాన్ని, ఆడ తనాన్ని గౌరవించినప్పుడే భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించిన వారమవుతామని చెప్పారు. అందుకే ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని ఆయన కోరారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa