ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజకీయాలకి అతీతంగా సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 03, 2025, 11:03 AM

రాజకీయాలకు అతీతంగా సీఎం చంద్రబాబునాయుడు సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు విడుదల చేస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు. ఆయన ఆదివారం అనంతపురం నగరంలోని టీడీపీ అర్బన కార్యాల యంలో ఇద్దరికి మంజూరై రూ.2.54 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలి యజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు నియోజక వర్గంలోని 50మందికి తొమ్మిది విడతల్లో రూ.69.16 లక్షలు సీఎంఆర్‌ ఎఫ్‌ చెక్కులు అందించామన్నారు. నియోజకవర్గంలోని బాధితులు అడిగిన వెంటనే సీఎం చంద్రబాబు సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు విడుదల చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రమేష్‌, పరమేశ్వరన, ముక్తియార్‌, చేపల హరి, గోళ్ల సుధాకర్‌నాయుడు, సైఫుద్దీన తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa