ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలులో ముగిసిన ఉరుసు ఉత్సవాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 03, 2025, 11:07 AM

కర్నూలు నగరంలోని రోజా వీధిలో వెలసిన దర్గాలో 535వ ఉరుసు ఉత్సవాలు ఆదివారం మధ్యాహ్నంతో ముగిశాయి. మూడు రోజుల పాటు కొనసాగిన ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు దర్గాలో సమాధి అయిన ఆధ్యాత్మిక గురువు హజరత సయ్యద్‌ షా ఇష్హాక్‌ సనావుల్లా ఖాద్రికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. వేడుకల్లో భాగంగా శనివారం అర్ధ రాత్రి నుంచి ఆదివారం తెల్లవారు జాము వరకు హైదరాబాదు, కర్నూలుకు చెందిన మతపెద్దల ఉద్బోధనలు, ఖవ్వాలి బృందం కార్యక్రమం అసాంతం ఆకట్టుకుంది. దర్గా పీఠాధిపతి సజ్జదే నషీన సయ్యద్‌ షా దాదాపాషా ఖాద్రి ఇతర మత పెద్దలతో కలిసి ఉరుసు ముగింపు ప్రార్థనలు నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం దర్గాలో పీఠాధిపతి దాదాపాషా ఖాద్రి, మత పెద్దల ఆధ్వర్యంలో ‘జియారత ఫాతేహాల్‌’ కార్యక్రమంతో ఉర్సు ఉత్సవాలు ముగిశాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa