బాపట్ల మండలం నర్సాయపాలెం గ్రామం మాదిగపల్లి సమీపంలో మాన్యాల కాలువ ఆక్రమించడంతో కాలువ దిగువనున్న పొలాలకు నీరు అందటం లేదని స్థానిక రైతులు అన్నారు. ఈ మేరకు సోమవారం బాపట్ల మండల ఎమ్మార్వోని కొంతమంది రైతులు కలిసి వినతిపత్రం అందజేశారు. మాన్యాల కాలవకు దిగువన సర్వేనెంబర్ 386/3 లో గల 43 ఎకరాలకు నీటిపారుదల లేకుండా ఇరువైపులా ఆక్రమణకు గురై ఉందని, ఆక్రమణకు గురైన కాలువను సర్వే చేయించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa