సినీనటుడు పోసాని కృష్ణమురళిపై మరో కేసు నమోదైంది. నరసరావుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందున కేసు నమోదు చేశారు. 153 ఏ 67 ఇట్ యాక్ట్ 504 సెక్షన్‌ల కింద ఆయనపై కేసు ఫైల్ చేశారు. ఈ క్రమంలో పీటీ వారెంట్‌తో నరసరావుపేట పోలీసులు రాజంపేట సబ్ జైలుకు వచ్చారు. రాజంపేట సబ్‌జైల్లో పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పోసానిని నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసరావుపేట టూ టౌన్ సీఐ హేమారావు ఆధ్వర్యంలో తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa