బెంగళూరు ఈస్ట్ రైల్వే స్టేషన్‌లో 3వ, 4వ లైన్ల పనుల కారణంగా గుంతకల్లు రైల్వే డివిజన్ గుండా వెళ్లే పలు రైళ్లకు ఆ స్టేషన్‌లో స్టాపింగ్‌ను తొలగించినట్లు రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాచిగూడ-మైసూరు(Kacheguda-Mysore) (నం. 12785) ఎక్స్‌ప్రెస్ రైలు, బెంగళూరు-ధర్మవరం (నం. 06595), ముంబై-బెంగళూరు (నం. 11301), ముంబై-కోయంబత్తూరు (నం. 11013), భువనేశ్వర్-బెంగళూరు (నం. 18463), దర్బంగ-మైసూరు (నం. 12577) అప్ అండ్ డౌన్ రైళ్లకు ఈ నెల 13వ తేదీ నుంచి నిరవధికంగా బెంగళూరు ఈస్ట్ రైల్వే స్టేషన్‌లో స్టాపింగ్‌ను తొలగించినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa