సీఎం చంద్రబాబు ఈనెల 8న ప్రకాశం జిల్లాకు రానున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్కాపురంలో ప్రభుత్వపరంగా నిర్వహించే సభకు హాజరవుతారు. అనంతరం అక్కడ సమీపంలోని వెలిగొండ ప్రాజెక్టును సందర్శిస్తారు.
ఆ మేరకు జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామితో సీఎం చర్చించి కార్యక్రమాన్ని నిర్ణయించారు. సీఎంవో నుంచి అందిన సమాచారంతో కలెక్టర్ తమీమ్ అన్సారియా ఏర్పాట్లపై దృష్టి సారించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa