ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రక్తస్రావంతో గర్భంలోని శిశువు మరణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 07, 2025, 09:44 AM

కర్నూలు జిల్లా, కోసిగిలో విచారకర సంఘటన జరిగింది. గ్రామంలోని 6వ వార్డుకు చెందిన జాలమంచలి అంజలి, సురేష్‌ దంపతులు ఎస్‌బీఐ బ్యాంకులో అకౌంటు పని నిమిత్తం వచ్చారు.బ్యాంకు మొదటి అంతస్తులో ఉంది. మెట్ల మార్గం తప్ప.. లిప్టు సౌకర్యం లేదు. దీంతో అంజలి అతి కష్టం మీద మెట్లు ఎక్కి బ్యాంకులోకి వెళ్లింది. ఆ సమయంలో ఆమెకు రక్త స్రావం కావడం మహిళా ఖాతాదారులు గమనించి చెప్పారు. అప్పటికే తీవ్ర రక్తస్రావమై అంజలి కళ్లు తిరిగి అక్కడే కూర్చుండిపోయింది. ఏం చేయాలో భర్త సురేష్‌కు పాలుపోలేదు. బ్యాంకులోనే ఓ మూలన కూర్చున్నారు. వెంటనే బ్యాంకు సిబ్బంది చొరవతో ఆటోలో గర్భిణిని కోసిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెడికల్‌ ఆఫీసర్‌ డా. మనోజ్‌కుమార్‌, డా. రజిత స్టెచ్చర్‌ సిద్ధంగా ఉంచారు. గర్భిణిని డెలివరీ రూములోకి తీసుకెళ్లి పరీక్షలు చేశారు. కొద్ది సేపటికి అంజలి మగ మృత శిశువును ప్రసవించింది. అంజలి పరిస్థితి విషమంగా ఉంది. డా. రజిత మాట్లాడుతూ అంజలికి వచ్చే నెల 12వ తేదీ డెలివరీ తేదీ ఉందని, అయితే.. మెట్లు ఎక్కడం వల్లనే రక్తస్రావం జరిగి గర్భంలోనే మగ శిశువు మరణించిందని తెలిపారు. తల్లి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదోని ప్రభుత్వ మదర్‌ అండ్‌ చైల్డ్‌ ఆసుపత్రికి 108 అంబులెన్సులో ఈఎంటీ నాగరాజు, పైలట్‌ భీమేష్‌ తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa