ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటర్ ప‌రీక్ష‌ రాస్తూ విద్యార్థిని ఆక‌స్మిక మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 09, 2019, 03:30 PM

 ఇంటర్మీడియట్ పరీక్ష రాస్తుండగా ఓ విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. ఈ ఘటన ఏపీ లోని కడప జిల్లా మైదకూరులో గల ఓ ప్రైవేటు కాలేజీలో నెలకొంది. వివరాల్లోకి వెళ్తే..సుజనకుమారి అనే విద్యార్థిని శనివారం ఇంటర్ పరీక్ష రాస్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆ విద్యార్థిని మృతిచెందింది. ఈ ఘటనతో తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు కన్నీటి పర్యంతం అయ్యారు. కాగా...పరీక్ష రాసి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్ళిన సుజనకుమారి ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో సుజనకుమారి ఇంటి పరిసరాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa