న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆర్‌ఇన్ఫ్రా) కంపెనీ రూ. 648 కోట్ల కాంట్రాక్టు దక్కించుకుంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లా హిరసార్‌లో నూతనంగా ఓ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు... ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఆర్‌ఇన్ఫ్రాకు ఈ కాంట్రాక్టు లభించింది. ఈ మేరకు ఆర్‌ఇన్ఫ్రా ఇవాళ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. అహ్మదాబాద్, రాజ్‌కోట్‌లను అనుసంధానం చేసే జాతీయ రహదారి-8బి సమీపంలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రాజ్‌కోట్‌లో ఉన్న ఎయిర్‌పోర్టు ఇక్కడికి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొత్త ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు కోసం నిర్వహించిన వేలంలో లార్సెన్ అండ్ టర్బో (ఎల్&టీ), దిలీప్ బిల్డ్‌కాన్, గాయత్రీ ప్రాజెక్ట్స్ సహా తొమ్మిది బిడ్డర్లు పోటీ పడగా... వాటిలో అనిల్ అంబానీ కంపెనీ విజేతగా నిలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa