ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తమ పార్టీ తరఫున లోక్‌సభకు పోటీ చేయనున్న అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. లాలూ ప్రస్తుతం పశుగ్రాసం కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థులను లాలూ ప్రసాద్ ఎంపిక చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచందర్ పుర్బే చెప్పారు. లాలూ సతీమణి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి అధ్యక్షతన జరిగిన పార్టీ రాష్ట్ర, కేంద్ర పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa