ట్రెండింగ్
Epaper    English    தமிழ்

14న ఘనంగా జనసేన ఆవిర్భావ వేడుకలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 09, 2019, 04:34 PM

కడప:  ఈనెల 14వ తేదీన జనసేన 5వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని జనసేన నాయకులు సుంకర శ్రీనివాస్ తెలిపారు. కడప జిల్లాలో ఆయన మాట్లాడుతూ…రాజమహేంద్రవరం వేదికగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుతున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. రాయలసీమలో రోజురోజుకు జనసేన పార్టీ బలపడుతుందన్నారు. జిల్లాలో జరిగిన జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతంగా కొనసాగిందన్నారు. కడప జిల్లా ప్రజలు జనసేన పార్టీకి బ్రహ్మరథం పట్టారని సుంకర శ్రీనివాస్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa