రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ ఇప్పుడు ఫీజు పోరు అంటూ కొత్త నాటకానికి తెరలేపారని మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో విమర్శించారు. ‘వైసీపీ చేపట్టే యువత పోరు అంతా బూటకమే. రాష్ట్రం సర్వనాశనం అవ్వడానికి జగన్ వైఖరే కారణం. అన్ని వ్యవస్థలనూ ధ్వంసం చేసిన జగన్‌కు సార్వత్రిక ఎన్నికల్లో యువత, మహిళలు, ప్రజలు బుద్ధి చెప్పారు. ఈ నెల 14న పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో నిర్వహించే జనసేన ఆవిర్భావ సభకు లక్షలాది మంది జనసైనికులు హాజరవుతున్నారు’ అని వివరించారు. ‘ఆవిర్భావ సభలో పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తాం’ అని మంత్రి అన్నారు.
![]() |
![]() |