పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం గోళ్లపాడులో చోరీ జరగింది. ఇంటి తాళం పగలగొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. 9 సవర్ల బంగారం, కిలో వెండి వస్తువులు పట్టుకుపోయారు. బాధితురాలు నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.అలానే పల్నాడు జిల్లా, సత్తెనపల్లి మండలం, దీపాలదిన్నేపాలెంలో భర్త గంగరామ్ ఘాతుకానికి పాల్పడ్డాడు. భార్య , మామ, బావమరిదిలపై గొడ్డలితో దాడి చేశాడు. కుటుంబ కలహల నేపథ్యంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మామ గంగయ్య(55) మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa