ఆంధ్రా యూనివర్సిటీ అంటే అందరికీ ఒక సెంటిమెంటుతో కూడుకున్నదని, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఛైర్మన్, జిఎమ్మార్ అధినేత ఏయూలో చదువుకుని వచ్చిన వారేనని, ఏయూ ప్రపంచంలోనే టాప్ 100లో ఉండాలని సిఎం చంద్రబాబు భావించారని విద్య,ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తర సమయంలో ఆయన మాట్లాడుతూ.. ఏయూ టాప్‌లో ఉండాలనే ఉద్దేశంతో ఐఐటి కరఖ్ పూర్ ప్రోఫెసర్ రాజశేఖర్‌ను ఏయూ వీసీగా నియమించామన్నారు.మాజీ సిఎం జగన్ విశాఖపట్నం వస్తే పిల్లలను రోడ్డుపైకి తెచ్చి స్వాగతం పలికించుకునేవారని, రూసా గ్రాంట్స్, ఇస్రో గ్రాంట్‌ను దుర్వినియోగం చేశారని మంత్రి లోకేష్ విమర్శించారు. మాజీ వీసీ ప్రసాదరెడ్డి రూలింగ్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారని అన్నారు. దీనిపై ఇన్చార్జి వీసీ ఒక కమిటీని నియమించారని తెలిపారు. విజిలెన్స్ అకౌంట్ కూడా వేశామన్నారు. సభ డిమాండ్ మేరకు కమిటీ విచారణ జరిపి 60 రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని మంత్రి లోకేష్ కమిటీని ఆదేశించారు. ఇంకోసారి పొరపాటు చేయాలంటే బయపడేటట్టు చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఆంధ్రా యూనివర్సిటీ ప్రమాణాలను పెంచి గతవైభవం తీసుకువస్తామని మంత్రి స్పష్టం చేశారు.
![]() |
![]() |