ఐఎంఎల్ (ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్) 2025లో ఇండియా మాస్టర్స్ టీమ్ ఫైనల్స్ కు దూసుకెళ్లింది. రాయపూర్ వేదికగా ఆస్ట్రేలియా మాస్టర్స్ తో జరిగిన సెమీ ఫైనల్స్ లో ఇండియా జట్టు 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 221 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 18.1 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌట్ అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ సిక్సర్లతో చెలరేగిపోయాడు. 30 బంతులను ఎదుర్కొన్న యువరాజ్ 7 సిక్సర్లు, 1 ఫోర్ సాయంతో 59 పరుగులు చేశాడు. సచిన్ 30 బంతుల్లో 42 పరుగులు (7 ఫోర్లు)... స్టువర్ట్ బిన్నీ 21 బంతుల్లో 36 పరుగులు (1 సిక్స్, 5 ఫోర్లు) చేశారు. భారత బౌలర్లలో షాబాజ్ నదీమ్ (4/15), వినయ్ కుమార్ (2/10), ఇర్ఫాన్ పఠాన్ (2/31) చెలరేగిపోయారు. అద్భుతంగా బౌలింగ్ చేసిన షాబాజ్ నదీమ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
![]() |
![]() |